- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DSP సిరాజ్.. యూనిఫామ్‌లో డీజీపీ ఆఫీస్‌కు..
తెలంగాణ పోలీసు శాఖలో డీఎస్సీ (DSP) హోదాలో ఉన్న టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్.. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసు శాఖలో డీఎస్సీ (DSP) హోదాలో ఉన్న టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్.. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం పోలీస్ హెడ్ క్వార్టర్‌కు పూర్తి పోలీస్ యూనిఫామ్‌తో విచ్చేసిన డీఎస్పీ సిరాజ్, సీవీ ఆనంద్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీవీ ఆనంద్ తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిరాజ్ ఆయనను కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఖాకీ దుస్తుల్లో డీజీపీ ఆఫీస్‌కు వచ్చిన సిరాజ్‌ను చూసి అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు.
శుభాకాంక్షలు తెలిపిన సిరాజ్..
ఈ భేటీ అనంతరం మహ్మద్ సిరాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో డీజీపీతో దిగిన ఫొటోను పంచుకుంటూ ప్రత్యేక పోస్ట్ పెట్టారు. "తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సార్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఆయన తన నూతన పదవీకాలాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో ఆయన నిరంతరం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను" అని సిరాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం డీఎస్పీ హోదాలో యూనిఫామ్‌లో ఉన్న సిరాజ్ ఫొటోలు, ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు 'డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటీ' అంటూ కామెంట్లు పెడుతున్నారు.






