- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊర చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
by Kodari Anjali |
ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో శనివారం చేపల వేటకు వెళ్ళిన ఆవుల తిరుపతయ్య మృతదేహం లభ్యం అయ్యింది.

X
దిశ, ఉప్పునుంతల: ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో శనివారం చేపల వేటకు వెళ్ళిన ఆవుల తిరుపతయ్య (55) అనే వ్యక్తి గ్రామ సమీపంలోని ఊర చెరువులో పడి గల్లంతయిన సంఘటన తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం చీకటిపడే వరకు ఫైర్, పోలీస్ అధికారులు శ్రమించినా ఆచూకీ లభ్యమవ్వకపోవడంతో వారు అక్కడినుండి వెళ్ళిపోయారు. సోమవారం డెడ్బాడీ నీటిపై తెలటంతో కుటుంబ సభ్యులు గ్రామస్తుల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Next Story






