- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ నుంచి సస్పెండ్ చేయండి.. మల్లారెడ్డిపై BRS గుస్సా!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు మాజీ మంత్రి మల్లారెడ్డి హాజరుకావడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త బజ్ క్రియేట్ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‍లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‍గా మారింది. గత కొంత కాలంగా సొంత కార్యక్రమాలకు అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్న మల్లారెడ్డి.. అనూహ్యంగా నిన్న ఘట్‍కేసర్‍లో అందెశ్రీ స్మృతి వనం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సభలో రేవంత్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్‍ను తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే అదే వేదికపై ఉన్న మల్లారెడ్డి మౌనంగా ఉండటం రాజకీయంగా కొత్త చర్చకు దారి తీసింది.
సస్పెండ్ చేయండి:
సీఎం రేవంత్ రెడ్డి తన బాస్ కేసీఆర్‍ను అన్నేసి మాటలు అంటున్నా మౌనంగా ఉండటంపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు, మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తుంటే పక్కనే కూర్చున్న మల్లారెడ్డి కనీసం లేచి వెళ్లిపోయినా ప్రజల్లోకి పార్టీ పరంగా ఒక సందేశం వెళ్లేదని కానీ అలా కాకుండా మౌనంగా కూర్చోవడం ఏంటని మల్లారెడ్డి వ్యవహారశైలిపై బీఆర్ఎస్ సపోర్టర్స్ మండిపడుతూ.. మల్లారెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన స్థానంలో నిఖార్సైన యువ నేతను బరిలోకి దింపండి తప్ప పార్టీలో ఇంకొక్క క్షణం అతడిని ఉండనివ్వొద్దని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఓ బీఆర్ఎస్ మద్దతుదారులు చేసిన పోస్టుపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం స్పందించారు. సీఎం సభలో మల్లారెడ్డి వ్యవహార శైలి నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసిందని కామెంట్ చేశారు.
మల్లారెడ్డి దారెటు?:
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారబోతున్నట్లు గత కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఆయన కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేశారని ఇందులో భాగంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్‍తోనూ భేటీ అయ్యారనే టాక్ వినిపించింది. ఇటీవల మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లడంతో మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలోకి వెళ్లబోతున్నారని, తెలంగాణ టీడీపీలో చేరబోతున్నారనే రకరకాల ప్రచారాలు గుప్పుమంటున్నాయి. అయితే నిన్న సరూర్ నగర్ లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు ఉండగా ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన మల్లారెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి సభకు మాత్రం హాజరు కావడం హాట్ టాపిక్ అయింది. తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం కావడం వల్ల ప్రోటోకాల్ ప్రకారం సీఎం సభకు హాజరయ్యారని భావించినప్పటికీ కేసీఆర్‍ను విమర్శిస్తుంటే మౌనంగా ఉండటం కారు పార్టీ కార్యకర్తలను ఆగ్రహానికి గురి చేస్తోంది. అయితే సీఎం సభకు హాజరైన మల్లారెడ్డి అసలు వ్యూహం ఏంటి? ప్రచారం జరుగుతున్నట్లు ఆయన పార్టీ మారుతారా? ఇంతకీ ఆయన దారెటు అనేది ఉత్కంఠగా మారింది.
వారినే నమ్ముతారు.. కేసీఆర్‍పై గుర్రు:
మల్లారెడ్డి వ్యవహారంలో తీవ్ర స్థాయిలో మండిపడుతున్న బీఆర్ఎస్ మద్దతుదారులు తమ బాస్ కేసీఆర్ తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారినే కేసీఆర్, కేటీఆర్ బాగా నమ్ముతారని ఆయా జిల్లాల్లో కూడా పార్టీ పెద్దలను తిడుతుంటే అదే వేదికలపై ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కనీసం ఖండించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీగా ఉండేవారిని నమ్మకుండా మల్లారెడ్డి లాంటి వారిని కేసీఆర్, కేటీఆర్ నమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా మల్లారెడ్డి తీరుపై కేసీఆర్ ఎలాంటి డిసిషన్ తీసుకోనున్నారో కాలమే సమాధానం చెప్పనుంది.






