- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు..
కులమతాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పేర్కొన్నారు.

దిశ,హుజూరాబాద్ రూరల్: కులమతాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. ఆదివారం హుజూరాబాద్ మండల పరిధిలోని తుమ్మనపల్లి గ్రామంలో ఎండీ మౌలానా - సలీంబి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. మొదటి విడతలో ఏ విధంగానైతే రాజకీయాలకు తావులేకుండా కేవలం అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేశామో, రాబోయే రెండో విడతలోనూ అదే విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, సర్పంచ్ అన్నాడి మాధవి రవీందర్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






