BREAKING: జర్నలిస్టుకు హిడ్మా చివరి లేఖ.. లొంగుబాటుపై కీలక అంశాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-19 07:57:28  IST  )

తాజాగా పదిరోజుల క్రితం ఆయన ఆయుధాలు వీడే ఆలోచనలో ఉన్నట్లుగా జర్నలిస్టుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

BREAKING: జర్నలిస్టుకు హిడ్మా చివరి లేఖ.. లొంగుబాటుపై కీలక అంశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: గెరిల్లా దాడి వ్యూహకర్త, మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మద్వి హిడ్మా మంగళవారం మారేడుమిల్లి టైగర్ జోన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పదిరోజుల క్రితం ఆయన ఆయుధాలు వీడే ఆలోచనలో ఉన్నట్లుగా జర్నలిస్టుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. త్వరలో తనను ఏపీలో కలవాలని జర్నలిస్టుకు సూచించినట్లు సమాచారం.

ఈ లేఖలో ఆయన తన భవిష్యత్ కార్యాచరణపై వివరించారు. ఆయుధాలను వదిలే ఆలోచనలో ఉన్న తాము ఎక్కడ లొంగిపోవాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తమ భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధమవుతామని తెలిపారు. దీనిపై త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ రిలీజ్ చేస్తామని హిడ్మా లేఖలో పేర్కొన్నారు. ఆయుధాలను వీడే ముందు కొన్ని అంశాలను చర్చించాలని లేఖలో తెలిపారు. ఇంతలోనే హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

Next Story