ఏపీ నెక్ట్స్ సీఎం అతడే: యాక్టర్ సుమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Satheesh |
ఏపీ నెక్ట్స్ సీఎం అతడే: యాక్టర్ సుమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాక్టర్ సుమన్ ఆంధ్రప్రదేశ్‌లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట పుల్లేటికుర్రులో శ్రీ చౌడేశ్వరిదేవి సమేత రామలింగేశ్వర ఆలయంలో బుధవారం నిర్వహించిన సుదర్శన యాగంలో పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామికి సుమన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమన్ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు 2024లో మళ్లీ వైసీపీ అధినేత జగనే సీఎం అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సీఎం జగన్ వెంటే ఉన్నారన్నారు. రెడ్డి కమ్యూనిటీలో కూడా మెజార్టీ వర్గం ఆయన వైపు ఉందని అభిప్రాయపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌లా అమలు చేసిన వారు దేశంలో మరెవరూ లేరని ప్రశంసలు కురిపించారు. ఏపీలోని ప్రతిపక్ష పార్టీలకు పొత్తులపై సరైన స్పష్టత లేదని.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Read More..

Breaking: అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. కాసేపట్లో ప్రధానితో సమావేశం

Polavaram: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. పోలవరానికి నిధులివ్వాంటూ విజ్ఞప్తి

Next Story

Most Viewed