నేడు మహాకవి శ్రీశ్రీ వర్ధంతి

by Jakkula Samataha |
నేడు మహాకవి శ్రీశ్రీ వర్ధంతి
X

దిశ, ఫీచర్స్ : నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను.. నేను సైతం విశ్వవ్రుష్టికి అశ్రువ వొక్కటి ధారపోశాను అంటూ.. ప్రపంచాన్నే మేల్కొలిపిన మహాకవి శ్రీశ్రీ. ఈయన పేరు తెలియని వారు ఉండరు. సామున్యుల నుంచి పేదసాదల జీవితలాను ప్రతిభింబించేలా ఎన్నో కవితలను రాశారు. కుక్క పిల్లా, సబ్బు బిళ్ళా.. అగ్గిపుల్లా కాదేదీ కవితకనర్హం అంటూ ప్రతి దాంట్లో కవితను సృష్టించిన గొప్ప వ్యక్తి . కాగా, నేడు ఈయన వర్దంతి.

శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగ శ్రీనివాసరావు. ఈయన విప్లవ కవిగా పేరు. శ్రీశ్రీ 1910 జనవరి 2న వూడిపెదది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించారు. 1950లో ఈయన మహాప్రస్థానం రాశారు. ఇది ఓ విప్లవమే సృష్టించిందని చెప్పాలి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటూ శ్రీశ్రీ తన కలంతో రాసిన ప్రతి అక్షరం తూటళ్లా పేలాయి. మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది అంటూ ఆయన రాసిన కవితలు యువకుల నరాల్లో నెత్తురు మరిగిపోయాలా చేశాయి. అలాంటి గొప్పకవి 1983 జూన్ 15న తన తుది శ్వాసను విడిచారు. కాగా, నేడు కవి శ్రీశ్రీ వర్ధంతి, ఈ సందర్భంగా అక్షర యోధుడికి మరోసారి అక్షర నివాళి.

Advertisement

Next Story

Most Viewed