‘మళ్లి కూయవే గువ్వా’ అంటూ సంగీత ప్రియుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ చక్రి జయంతి!

by Jakkula Samataha |   ( Updated:2024-06-15 03:09:26.0  )
‘మళ్లి కూయవే గువ్వా’ అంటూ సంగీత ప్రియుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ చక్రి జయంతి!
X

దిశ, సినిమా : మాస్, మెలోడీ సాంగ్స్‌తో సంగీత ప్రియుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి చక్రి. బాచి సినిమాతో ఈయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. చాలా తక్కువ సమయంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. మళ్లి కూయవే గువ్వా అంటూ.. ఎన్నోసాంగ్స్ పాడి,సంగీతం సమకూర్చిన గొప్ప సంగీత దర్శకుడు చక్రి జయంతి నేడు.

ఈయన 1974 జూన్ 15న తెలంగాణలోని కంబాలపల్లిలో జన్మించారు. ఈయన పూర్తి పేరు గిల్లా చక్రధర్. చక్రికి చిన్నప్పటి నుంచే సంగీతం అంటే చాలా ఇష్టం ఉండటం వలన ఆయన సంగీతం నేర్చుకున్నారు. తర్వాత చాలా కష్టాలు పడి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, సక్సెస్ అయ్యారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈయన 2014 డిసెంబర్ 15న తన తుది శ్వాస విడిచారు. కాగా, ఈయన బాచీ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, ఆంధ్రావాలా, శివమని, దేశముదురు, వీడే, దేవదాస్, ఢీ, కృష్ణ, మస్కా, అమ్మాయిలు అబ్బాయిలు, సత్యం, ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, సింహా, దేనికైనా రెడీ వంటి చాలా సినిమాలకు సంగీతం అందించారు.

Advertisement

Next Story

Most Viewed