Polavaram: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. పోలవరానికి నిధులివ్వాంటూ విజ్ఞప్తి

by Disha Web Desk 16 |
Polavaram:  ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. పోలవరానికి నిధులివ్వాంటూ విజ్ఞప్తి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీతో సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు తాత్కాలిక సహాయం కింద తక్షణమే 12 వేల 911 కోట్లు విడుదల చేయాలని మోదీని సీఎం కోరారు. ఇంకా పెండింగ్ సమస్యలపైనా ప్రధానితో జగన్ చర్చిస్తున్నారు.

మరోవైపు సీఎం జగన్ వరుసగా కేంద్రమంత్రులను కలుస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఢిల్లీలోని హోంమంత్రి కార్యాలాయానికి వెళ్లిన సీఎం జగన్.. నేరుగా అమిత్ షాతో భేటీ అయి చర్చించారు. వీరి భేటీ దాదాపు 45 నిమిషాలకు పైగా సాగింది. ఏపీకి సంబంధించిన పలు విషయాలపై వీరిద్దరూ చర్చించారు. భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై కేంద్రమంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు.

మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారని.. కేంద్ర కేబినెట్‌లో వైసీపీ చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

Read More..

Breaking: అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. కాసేపట్లో ప్రధానితో సమావేశం

Next Story

Most Viewed