ఆడవాళ్లు ఆ ఐదు రోజుల పాటు ఒంటిపై నూలు పోగు లేకుండా కనిపిస్తారు.. ఎక్కడో కాదు మనదేశంలోనే

by Kavitha |
ఆడవాళ్లు ఆ ఐదు రోజుల పాటు ఒంటిపై నూలు పోగు లేకుండా కనిపిస్తారు.. ఎక్కడో కాదు మనదేశంలోనే
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రపంచంలో జరిగే వింతలు.. విశేషాలు అన్ని తెలుస్తున్నాయి. వాటి గురించి తెలుసుకున్న తర్వాత.. నిజంగా ఇలా ఉంటాయా.. అని ఆశ్చర్య పోవడం ఖాయం. అయితే ఇందులో కొన్ని ఆచారాలు వింతగా ఉంటే.. మరికొన్ని ఆచారాలు ఎబ్బెట్టు కలిగిస్తుంటాయి. అయితే ఇలాంటి ఆచారం ఒకటి మన దేశంలో ఉందట.. అది ఇటీవల వెలుగులోకి వచ్చింది.. ఇంతకీ అది ఏంటంటే..

హిమాలయాలకు దగ్గరలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రం లోని కులు జిల్లాలో పిని అనే ఓ గ్రామం ఉంది. ఈ గ్రామంలో మహిళలు ఏడాదిలో ఐదు రోజుల పాటు ఒంటిపై నూలు పోగు లేకుండా కనిపిస్తారు. వందల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయాన్ని వారు పాటిస్తున్నారు. పైగా ఇది వారి తరతరాల ఆచారమని చెబుతున్నారు. ఇలా నగ్నంగా ఉంటే ప్రకృతికి గౌరవం ఇచ్చినట్టు వారు భావిస్తారట. వారి ఆరాధ్య దైవానికి నగ్నంగానే పూజలు చేస్తారట. ఇలా నగ్నంగా ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలిని, పరిశుద్ధమైన సూర్య కాంతిని, సహజ వాతావరణాన్ని ఆలింగనం చేసుకునేందుకు అవకాశం ఉంటుందట. దీనివల్ల భౌతిక శక్తులు శరీరానికి మంచి చేస్తాయట. ఎటువంటి వ్యాధులు, ఇతర రుగ్మతలు దరి చేరవట. పైగా శరీరం మరింత రోగ నిరోధక శక్తిని పెంచుకుంటుందట.. నగ్నంగా ఉంటే భౌతిక పరమైన కోరికలపై అదుపు ఉంటుందట. గ్రామం మొత్తం మహిళలు ఇలానే చేస్తారట.

అదేవిధంగా ఇలా నగ్నంగా ఉండటం వల్ల మహిళలు తమ అంత : శుద్ధి చేసుకున్నట్టు భావిస్తారట. ఇలా నగ్నంగా ఉండి తమ ఆరాధ్య దైవానికి పూజలు చేస్తే కరుణిస్తుందని వారి నమ్మకమట. అయితే నగ్నంగా మహిళలు ఉన్న ఆ ఐదు రోజులు గ్రామానికి ఇతరులను రానివ్వరు. సరిహద్దుల వద్ద పురుషులు కాపలా కాస్తారట. చివరికి బంధువులు, దగ్గరి వాళ్ళను కూడా అనుమతించరట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో.. ఆ గ్రామం గురించి చాలామంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.Next Story

Most Viewed