హ్యాపీ బర్త్‌డే కొరటాల శివ.. రైటర్‌గా అడుగు పెట్టి స్టార్ డైరెక్టర్‌గా మారిన ఈయన జర్నీ ఇదే!

by Jakkula Samataha |   ( Updated:2024-06-15 03:12:13.0  )
హ్యాపీ బర్త్‌డే కొరటాల శివ.. రైటర్‌గా అడుగు పెట్టి స్టార్ డైరెక్టర్‌గా మారిన ఈయన జర్నీ ఇదే!
X

దిశ, సినిమా : స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈయన 1975 జూన్ 15న ఏపీలోని గుంటూరు జిల్లా, పెదకాకనిలో జన్మించారు. వీరిది కమ్యూనిస్టు భావజాలం ఉన్న కుటుంబం. అందుకే ఇంటి నిండా పుస్తకాలు ఉండేవి, అలాగే అందరూ విద్యావంతులు. కొరటాల శివ కూడా అప్పుడప్పుడు కవితలు రాస్తూ ఉండేవారు. ఇక బీటెక్ పూర్తి చేసిన శివ. 1998లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరారు. సరదాగా కవితలు రాసే స్వభావం ఉండటంతో, తన వరసకు బావైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరారు. మున్నా, బృందావనం, ఊసరవెల్లి, ఒక్కడున్నాడు వంటి సినిమాలకు రచయితగా పని చేశారు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ సక్సెస్‌తో ఇక ఈయన స్టార్ డైరెక్టర్ రేంజ్‌కు ఎదిగిపోయాడు.మొదటి సినిమాతో బాక్సఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించారు. ఈ సినిమా ఏకంగా ఆరోజుల్లో నంది అవార్డును సైతం అందుకుంది.

ఇక తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు, బ్లాక్ బస్టర్ హిట్, జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ మరో సూపర్ హిట్, మళ్లీ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చిరు, రామ్ చరణ్‌తో ఆచార్య సినిమా తెరకెక్కించి కాస్త ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నారు. ఇక ఈయన ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed