అల్లు అర్జున్ని అన్ ఫాలో చేసిన సాయిధరమ్ తేజ్.. నిహారిక రియాక్షన్ ఇదే..!

by Kavitha |
అల్లు అర్జున్ని అన్ ఫాలో చేసిన సాయిధరమ్ తేజ్.. నిహారిక రియాక్షన్ ఇదే..!
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ గెలుపును బుల్లితెరపై చూసేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం జనసేనాని అధినేత పిఠాపురంలోని తన ఇంట్లో 'కౌంటింగ్' రోజున హాజరయ్యారు అనే విషయం తెలిసిందే. కానీ ఇందులో అల్లు ఫ్యామిలీ జాడ మాత్రం కనిపించలేదు. అదేవిధంగా పవన్ గృహప్రవేశం సమయంలో, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా అల్లు అరవింద్ లేదా అల్లు అర్జున్, శిరీష్ సహా ఇతర అల్లు కుటుంబంలోని వ్యక్తులు ఎవ్వరూ కూడా హాజరు కాలేదు. దీంతో మెగా కజిన్ సాయి ధరమ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్‌లో అల్లు అర్జున్‌ని అన్‌ఫాలో చేశాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అయితే తాజాగా బన్నీతోపాటు ఆయన కుటుంబ సభ్యులనూ అన్‌ఫాలో అయ్యారని నెట్టింట చర్చ సాగిన విషయంపై కొనిదెల నీహారిక స్పందించారు. 'కమిటీ కుర్రోళ్లు' సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరైన నిహారికను ఇదే విషయమై ఓ విలేకరి ప్రశ్నించగా ఆమె.. దాని గురించి తనకు తెలియదని.. అయినా ఎవరి రీసన్స్ వారికి ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా 'కమిటీ కుర్రోళ్ళు' మూవీని యదు వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజా కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు.Next Story

Most Viewed