బడిబాట వేళ షాకింగ్ ఘటన.. మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీ కట్టిన విద్యార్థులు

by Rajesh |
బడిబాట వేళ షాకింగ్ ఘటన.. మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీ కట్టిన విద్యార్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: బడిబాట వేళ రాష్ట్రంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామం బ్రాహ్మణవెల్లంలలో బడి బాట కార్యక్రమం ఉండగా.. ఏకంగా పాఠశాల విద్యార్థులతో ఫ్లెక్సీలు కట్టించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే విద్యార్థులు ఫ్లెక్సీల ఏర్పాటు కోసం తొలుత గుంతలు తవ్వి కట్టెలు పాతారు. అనంతరం గోడపైకి ఎక్కి మంత్రికి స్వాగతం తెలిపే ఫ్లెక్సీ కట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇదేనా మార్పు అంటే అని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులను కార్యకర్తలుగా మార్చేస్తే ఈజీ అయిపోతుందని ఇలా చేస్తున్నారా అంటూ మండిపడుతున్నారు.Next Story

Most Viewed