వికలాంగులకు 5శాతం నిధులు కేటాయించాలి

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం కేంద్రం నిధులు కేటాయించకపోవడం వారి హక్కులను హరించడమేనని కాంగ్రెస్ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. గురువారం సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా లాక్‌డౌ‌న్‌లో వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో వికలాంగులకు ఒక్కరూపాయి కేటాయించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే 5శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల చట్టం 2016, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ‌ వికలాంగులను ఏ విధంగా ఆదుకోవాలో స్పష్టం చేసిందని, ఆ విషయాన్ని కేంద్రం తెలుసుకోవాలన్నారు.

Next Story