ల్యాబ్ కిట్లు లేవు.. రక్త పరీక్షలు లేవు..

by Aamani |
ల్యాబ్ కిట్లు లేవు.. రక్త పరీక్షలు లేవు..
X

దిశ,మేడిపల్లి : మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ చెంగిచర్ల చౌరస్తా వద్ద గల బస్తీ దావఖనలో దాదాపుగా నెల రోజుల నుండి రక్త పరీక్షలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివరాల ప్రకారం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న బస్తీ దావఖానాలకు సుస్తి వచ్చింది. రోగులకు పరీక్షలు ఉచితంగా చేయడంతో అనేక పేద, మధ్యతరగతి వారికి ఎంతగానో ఉపయోగపడేవి, కానీ ఇక్కడ రక్త నమూనాలు సేకరించడానికి అవసరమయ్యే కిట్లు లేక గత నెల రోజుల నుంచి పరీక్షలు చేయడం లేదు. సంబంధిత అధికారులు తనిఖీ చేసి రక్త నమూనాలు సేకరించడానికి కిట్లను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కొన్ని బస్తీ దావఖానాలలో వైద్యులు శనివారం తో పాటు ఆదివారం కూడా విధులకు డుమ్మా కొడుతున్నారని ఆదివారం వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

Next Story