క్షణికావేశంలో బావిలో దూకి.. వివాహిత ఆత్మహత్య

by  |
క్షణికావేశంలో బావిలో దూకి.. వివాహిత ఆత్మహత్య
X

దిశ, డోర్నకల్: బావిలోకి దూకి వివాహిత గుగులోత్ సునీత(23) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మరిపెడ మండలంలోని తండా ధర్మారంలో శుక్రవారం జరిగింది. స్థానిక ఎస్‌ఐ అశోక్ వివరాల ప్రకారం.. మృతురాలి భర్త పరమేష్ మద్యానికి బానిసై తరచూ ఆమెతో గొడవ పడేవాడు. మద్యం మానేయమని పలు మార్లు చెప్పినా భర్త వినకపోవటంతో తీవ్ర మనస్థాపానికి గురైన సునిత, క్షణికావేశంలో తన ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి రెండేండ్ల కొడుకు ఉన్నాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు ఎస్ఐ అశోక్ తెలిపారు.

Next Story

Most Viewed