అక్రమాల పుట్టలా వైద్య, ఆరోగ్య శాఖ..! ఆ ఇద్దరిపై వేటు పడనుందా?

by Shiva |
అక్రమాల పుట్టలా వైద్య, ఆరోగ్య శాఖ..! ఆ ఇద్దరిపై వేటు పడనుందా?
X

ఖమ్మం వైద్య, ఆరోగ్య శాఖలో అక్రమాలను ‘దిశ’లో అనేక కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14వ అనర్హులకు పదోన్నతులు అంటూ కథనం ప్రచురించగా దీనిపై సంబంధిత శాఖ కమిషనర్ విచారణకు ఆదేశించారు. కానీ, అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా తెలుస్తోంది. అసలైన వ్యక్తులను వదిలి కింద స్థాయి ఇద్దరు ఉద్యోగులను ఎందుకు బలి చేశారో ఇప్పుటికీ అర్థం కానీ ప్రశ్నగా మారింది. ఖమ్మం డీసీహెచ్, మంత్రి పేషిలో ఉన్న వ్యక్తి ఒక్కటే సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి డీసీహెచ్‌పై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారని తెలుస్తోంది.

దిశ, ఖమ్మం: ఖమ్మం వైద్య, ఆరోగ్య శాఖలో జరిగిన అక్రమాలను దిశలో అనేక కథనాలు ప్రచురించింది. ‘దిశ’ కథనాలను హైదరాబాద్ వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ఫిబ్రవరి 14వ అనర్హులకు పదోన్నతులు అంటూ కథనం ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. ఈ కథనంపై కమిషనర్ విచారణకు కూడా ఆదేశించారు. హైదరాబాద్ నుంచి విచారణ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు తెలుస్తోంది. 2020లో డీసీహెచ్ఎస్ విభాగంలో కొత్తగూడెంలో జేఎస్‌డబ్ల్యూగా విధులు నిర్వహిస్తున్న సునీతకు మెడికల్ రికార్డు అసిస్టెంట్, ఖమ్మంలో వాచ్‌మెన్ కమ్ వాటర్ అసిస్టెంట్ ఖాసింకు మెడికల్ రికార్డు అసిస్టెంట్‌‌కు పదోన్నతులు కల్పించేందుకు ఇద్దరు సహకరించారని, విచారణలో నిజానిజాలు బయటకు తీసి, వారిని ఈ నెల10న వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

డీసీహెచ్ ప్రమేయం లేకుండానే..

ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విభాగంలో డీసీహెచ్ఎస్ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంలో సంబంధిత శాఖ కమిషనరేట్ నుంచి విచారణ అధికారులు వచ్చి రికార్డులు పరిశీలించారు. ‘దిశ’ పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ చేశారు. కానీ, ఇప్పటి వరకు విచారణ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు తెలియదు. 2018 సంవత్సరంలో ఇదే శాఖలో ఐదుగురు సిబ్బందికి అక్రమంగా పదోన్నతులు కల్పించే సమయంలో డీసీహెచ్ అధికారికి తెలియకుండా ఎలా జరిగి ఉంటుందని ఇదే శాఖలో ఉద్యోగులు తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. విచారణలో అసలైన వ్యక్తులను వదిలి కింద స్థాయి ఇద్దరు ఉద్యోగులను ఎందుకు బలి చేశారో ఇప్పుటికి అర్థం కానీ ప్రశ్నలా మిగిలింది.

ఒత్తిడి చేస్తూ.. అడ్డుపడుతూ..

డీసీహెచ్ఎస్ విభాగంలో అనేక ఆరోపణలు వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ కమిషనరేట్‌లో కొంతమంది అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు. మంత్రి పేషీలో వ్యక్తిగత సహాయకుడు ఉండే అతను ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో విచారణ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసి అడ్డుపడుతున్నట్లు సమాచారం. దాంతో పాటు ఖమ్మం డీసీహెచ్, మంత్రి పేషీలో ఉన్న వ్వక్తి ఒక్కటే సామాజిక వర్గం చెందిన వారు కాబట్టి ఎవరు డీసీహెచ్‌పై చర్యలు తీసుకున్నందుకు వెనుకడుతున్నారని తెలుస్తోంది. ఖమ్మం వైద్య, ఆరోగ్య శాఖలో ఏదైనా ఆరోపణలు వస్తే వెంటనే అధికారులు అతన్ని కలిసి చర్యలు తీసుకోకుండా చూడాలి కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జరుగుతున్న తతంగంపై సంబంధిత శాఖ మంత్రి దృష్టి సారించాలని ఉద్యోగులు కోరుకున్నారు.

Advertisement

Next Story