తన 30 ఏళ్ల కెరీర్‌లో రమ్యకృష్ణ ఎంత సంపాదించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

by Kavitha |
తన 30 ఏళ్ల కెరీర్‌లో రమ్యకృష్ణ ఎంత సంపాదించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, సినిమా: అప్పట్లో అగ్ర హీరోల సినిమాల్లో నటించి ఓ ఊపు ఊపిన హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్ పాత్రలో నటించాలంటే రమ్యకృష్ణకు సాటి ఎవ్వరు లేరు. తన ఆవేశాన్ని ఉక్రోశాన్ని చూపిస్తూ ఆమె నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ‘బాహుబలి’ చిత్రంలో పాన్ ఇండియా ప్రభాస్‌కు తల్లిగా మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇక అప్పటినుంచి మదర్ క్యారెక్టర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది రమ్యకృష్ణ.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈమె ఆస్తికి సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. దాదాపు 30 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న రమ్యకృష్ణ నికర విలువ రూ.90 కోట్లు. అలాగే ఇప్పుడు ఉన్న నటీమణులలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటి కూడా ఈమెనే. ఒక్కో సినిమాకు రూ.3 నుంచి రూ. 4 కోట్ల వరకు తీసుకుంటారు. అలాగే ఎండార్స్‌మెంట్‌లు, వాణిజ్య ప్రకటన కోసం భారీ మొత్తంలో వసూలు చేస్తారని సమాచరం.

కాగా మూవీస్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై సందడి చేసింది. రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.Next Story

Most Viewed