ఆ వార్తలు నిజం కాదు.. ఈ నెల చివరి వారంలోనే రూ.2 వేలు

by  |
ఆ వార్తలు నిజం కాదు.. ఈ నెల చివరి వారంలోనే రూ.2 వేలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంకి సంబంధించిన 8వ విడత నగదును రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి రైతుల అకౌంట్లలో రూ.2 వేలు జమ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనని నమ్మి చాలామంది రైతులు బ్యాంకులకు వెళ్లి నగదు జమ కాలేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలో దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి స్పందించారు. ‘8వ విడత డబ్బులను జమ చేసినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అది నిజం కాదు. ఇప్పటివరకు డబ్బులు రిలీజ్ చేయలేదు. ఈ పథకం ఎప్పటినుంచో ఉంది. ఎన్నికల కోడ్ ఇబ్బంది కలిగించదు’ అని ఆయన అన్నారు.

అయితే ఏప్రిల్ 20 నుంచి 25 మధ్య 8వ విడత నగదును జమ చేసే అవకాశమున్నట్లు సమాచారం. ప్రతిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఈ డబ్బులను రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మోదీ ప్రచారంలో బిజీగా ఉండిపోయారు. అందుకే ఈ నెల తొలివారంలో నగదును జమ చేయలేదని తెలుస్తోంది.

Next Story

Most Viewed