దీప్తి సునయన, షన్ను ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ కలిసిన ఇద్దరు.. ఇక పెళ్లే తరువాయి..

by sudharani |
దీప్తి సునయన, షన్ను ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ కలిసిన ఇద్దరు.. ఇక పెళ్లే తరువాయి..
X

దిశ, సినిమా: దీప్తి సునయన, షణ్ముఖ్ జంటకు ఫ్యాన్స్ ఎక్కువే. ఇద్దరు కలిసి చేసిన పాటలు, ప్రాజెక్ట్స్ అన్నీ హిట్. ఆమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు ప్రేమ అని కన్ఫర్మ్ అయింది. అయితే షన్ను బిగ్ బాస్ వెళ్ళినప్పుడు ఈ లవ్ కాస్త బ్రేకప్ కు దారితీసింది. సిరి హన్మంతు, షన్ను మధ్య నడిచిన లవ్ ట్రాక్ ఇందుకు కారణం. కాగా సిరి, షన్ను ముద్దుపెట్టుకోవడాన్ని తట్టుకోలేక పోయిన దీప్తి సునయన బ్రేకప్ చెప్పినట్లు సోషల్ మీడియా వేదికగా కన్ఫర్మ్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు కలుసుకోకుండానే ఉంటున్నారా? అంటే కాదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీప్తి, షన్ను కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారని ఈ క్రమంలోనే వారు ఇద్దరు కలవాల్సి వస్తుందని తెలుస్తోంది. ఇది యూట్యూబ్ ని షేక్ చేసే ప్రాజెక్ట్ అవుతుందని సమాచారం. కాగా ఇదే క్లోజ్ నెస్ మెయింటేన్ చేస్తే మళ్లీ ప్రేమ చిగురించే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. కాగా ప్రస్తుతం ఇద్దరు కూడా కెరీర్ లో సక్సెస్ అయి మంచిగా సంపాదించేశారు. సొంత ఇల్లు, కారుతో హ్యాపీగా ఉన్నారు. ఇక వీరిద్దరు ఏకం అయితే ఇంకా బాగుంటుందని ఆశ పడుతున్నారు ఫ్యాన్స్.

Next Story