ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి

by Aamani |
ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి
X

దిశ, వరంగల్ టౌన్ : ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన ఏనుమముల పరిధిలోని ముసలమ్మ కుంటలో మంగళవారం చోటుచేసుకుంది. ఏనుమముల సీఐ పులి రమేష్ తెలిపిన వివరాలు ఇలా.. దేశాయిపేటకు చెందిన జన్ను ఆదం (38),జన్ను ఏసు (34) లు మంగళవారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి ముసలమ్మ కుంట వెళ్లారని ప్రమాదవశాత్తు కుంట లోని నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. మృతులు ఆదం,ఏసుల భార్యలు రాధిక, రామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడు ఆదంకు ఇద్దరు కుమారులు ఆదిత్య,గౌతమ్, మృతుడు ఏసుకు ఇద్దరు కు కుమారులు విశాల్,వివేక్ లు ఉన్నారు.

Next Story

Most Viewed