అంగట్లో దొంగ నోట్లు చలామణి..

by Aamani |
అంగట్లో దొంగ నోట్లు చలామణి..
X

దిశ, రామడుగు : సందట్లో సడే మీయ అన్న చందంగా అంగట్లో దొంగ నోట్ల చలామణి చాలా సులభంగా సాగుతుందని, దానికి ఇదే నిదర్శనం. వివరాల్లోకి వెళితే రామడుగు మండల కేంద్రంలో ప్రతి మంగళవారం అంగడి జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇదే అదునుగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు కూరగాయల కొనుగోలు పేరుతో రూ. 500 నోట్లు రూ. 100 నోట్లు చెలామణీ చేస్తున్నారు. కూరగాయలు అమ్ముకుంటున్న నిరుపేద రైతుల పాపం ఈ దొంగ నోట్ల వ్యవహారానికి బలైపోవాల్సిందే. ఈరోజు మంగళవారం నాడు ఇలాంటి రూ. 500 నోటు, రూ.100 నోటు వచ్చినట్లు గ్రామంలోని సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. వందల నోటు పై మనోరంజన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించడం ఫన్ ఆఫ్ ఫన్ అని రాసి ఉన్న దాన్ని గుర్తు పట్టినట్లు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దుస్థితి. గ్రామంలోని ప్రజలు ఇలాంటి దొంగ నోట్ల చలామణి జరుగుతున్నందున జాగ్రత్త వహించాలని ప్రజలు వ్యాపారస్తులు చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed