టాలీవుడ్ పరువు తీసింది.. హేమపై కరాటే కల్యాణీ షాకింగ్ కామెంట్స్!

by sudharani |
టాలీవుడ్ పరువు తీసింది.. హేమపై కరాటే కల్యాణీ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బెంగళూరు రేవ్ పార్టీ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ పార్టీలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. అందులో తెలుగు నటి హేమ పేరు కూడా వినిపించడంతో.. అక్కడ ఉన్నది ఆమె కాదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని, హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో చిల్ అవుతున్న అంటూ ఓ వీడియో సైతం రిలీజ్ చేసింది. అయినప్పటికీ నటి హేమ రేవు పార్టీలో ఉన్నట్లు పలు ఆరోపణలు రావడంతో.. పోలీసులు హేమ వీడియోపై ఫోకస్ పెట్టారు. ఆమె తీసిన వీడియో ఎక్కడ నుంచి తీశారో అని ఎంక్వైరీ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హేమపై నెట్టింట ట్రోల్స్ కూడా పెరిగాయి. అక్కడ ఉన్నది హేమనే అంటూ పలువురు కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి కరాటే కల్యాణీ కామెంట్స్ షోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘బెంగళూర్ రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ నిజంగానే పట్టుబడింది. అయినప్పటికీ తాను ఆ పార్టీలో లేనంటూ కవర్ చేసేందుకు ఆమె చేసే ప్రయత్నాలు ఫలించక పోగా.. తన వ్యవహారశైలితో టాలీవుడ్ పరువు తీస్తుంది. టాలీవుడ్‌లో ఎంతో మంది మంచి పనులు చేసిన వారు ఉన్నారు. కానీ ఇటువంటి ఘటనల్లో పట్టుబడిన ఒకరిద్దరు కాణంగా ఇండస్ట్రీకి డ్రగ్స్, రేవ్ పార్టీల కల్చర్ ఉన్నట్లు చెడ్డపేరు వస్తుంది’ అని చెబుతూ.. కో మహిళా యాక్టర్‌గా హేమ డ్రగ్ తీసుకోలేదని శాంపిల్స్ పరీక్షల్లో రుజువు కావాలని కోరుకుంటున్నాను’ అంటూ కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Next Story