పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్సై మొదటి భార్య ధర్నా

by Sridhar Babu |
పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్సై మొదటి భార్య ధర్నా
X

దిశ, కొమురవెల్లి : కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్సై నాగరాజు మొదటి భార్య మానస మంగళవారం ధర్నా చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఎస్సై నాగరాజుకు మొదటి భార్య మానసతో గత 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. రెండు సంవత్సరాల క్రితం మరో మహిళను పెండ్లి చేసుకొని, మానస ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లాడు. ఎస్సై నాగరాజు తనకు విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నాడు. దీంతో తాను ఆత్మహత్య చేసుకునేందుకు సూసైడ్ నోట్ రాయగా తమ కుటుంబ సభ్యులు పిల్లలను తనకు ఇప్పిచ్చి న్యాయం చేస్తా అని చెప్పడంతో విరమించినట్లు తెలిపింది. ఎస్సై నాగరాజు పై సిద్దిపేట సీపీ, చేర్యాల సీఐకి, కరీంనగర్ లోని మహిళా

ఉమెన్స్ లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడం లేదని తెలిపింది. తన భర్త నాగరాజుకు తాను ఫోన్ చేస్తే తన నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి తనకు రెస్పాండ్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన పిల్లలను తీసుకొని వెళ్లడానికి కొమురవెల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి తాను ఎస్సై భార్యనని చెప్పితే నీవు ఎస్సై భార్యవు కాదు ఎస్సై భార్య పోలీస్ స్టేషన్ కు చాలాసార్లు వచ్చిందని, ఆమె మాకు తెలుసు అని మీరు ఎవరో అని సిబ్బంది తెలపడంతో ఆమె ధర్నా కు దిగినట్లు తెలిపింది. తన ఇద్దరు పిల్లలను అప్పగించి తనకు న్యాయం చేయాలని, న్యాయాన్ని రక్షించే వ్యక్తి మరో మహిళను వివాహం చేసుకొని తనకు అన్యాయం చేయడంపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed