మాస్క్ పెట్టుకుని రోడ్లపై నార్మల్‌గా తిరుగుతున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే.. ఫొటోస్ వైరల్

by sudharani |
మాస్క్ పెట్టుకుని రోడ్లపై నార్మల్‌గా తిరుగుతున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే.. ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా: సినీ సెలబ్రెటీలు రోడ్లపై కనిపిస్తే చాలు మీడియా వాళ్లు.. ఫొటోలు, వీడియోలు తీస్తూ హల్ చల్ చేస్తారు. దీంతో సెలబ్రెటీలు బయటకు వచ్చేటప్పుడు మొత్తం కవర్ చేసుకుని తిరుగుతుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా మొఖానికి మాస్క్ పెట్టుకుని.. క్యాప్ ధరించి అంత కవర్ చేసుకుని చాలా నార్మల్‌గా తిరుగుతుంది. ఆమె మరెవరో కాదు మన నేషనల్ క్రష్ రష్మిక.

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన అందం, యాక్టింగ్‌తో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవల్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక.. ప్రజెంట్ ‘పుష్ప 2’ తో బిజీగా ఉంది. అయితే.. తాజాగా ఈ బ్యూటీ ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చింది. ముఖానికి మాస్క్, నల్లటి కళ్లద్దాలు, తలకి క్యాప్ పెట్టుకుని చాలా నేచురల్‌గా బయటకు వచ్చింది. ఈ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించిన రష్మికను గుర్తుపట్టిన ఫొటో గ్రాఫర్లు వాళ్ల కెమెరాల్లో బంధించి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. బ్లూ జీన్స్, వైట్ షర్ట్‌లో చాలా ముద్దుగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Next Story