క్యూ7 బోల్డ్ ఎడిషన్‌ను విడుదల చేసిన ఆడి ఇండియా.. ప్రారంభ ధర రూ. 98 లక్షలు

by Gopi |
క్యూ7 బోల్డ్ ఎడిషన్‌ను విడుదల చేసిన ఆడి ఇండియా.. ప్రారంభ ధర రూ. 98 లక్షలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ బ్రాండ్ ఆడి ఇండియా తన ఎస్‌యూవీ మోడల్ క్యూ7 స్పెషల్ బోల్డ్ ఎడిషన్‌ను మంగళవారం మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 97.84 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కారులో అత్యాధునిక ఫీచర్లతో పాటు భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. స్పెషల్ ఎడిషన్ కావడంతో బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీ కింద ఫ్రంట్ అండ్ రేర్‌లో బ్లాక్ ఔట్ ఆడి బ్రాండింగ్ రింగ్స్, గ్లాస్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ విండో, రూఫ్ రెయిల్స్ లాంటివి ఉన్నాయి. నాలుగు రంగుల్లో అందుబాటులో ఉండే ఈ కారులో 19-స్పీకర్ బీఅండ్ఓ సౌండ్ సిస్టమ్‌తో కూడిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, క్లైమెట్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్ ప్లస్, 360 డిగ్రీ కెమెరా, పానరోమిక్ సన్‌రూఫ్ ఫీచర్లను కలిగి ఉంది. 8-స్పీడ్ ఆటోమెంటిక్ ట్రాన్స్‌మిషన్, విలక్షణమైన స్టైలింగ్‌తో కూడిన ప్రత్యేకమైన వేరియంట్‌ను అందిస్తున్నామని కంపెనీ వెల్లడించింది.

Next Story

Most Viewed