సకాలంలో పనులు పూర్తి చేయాలి : జిల్లా అదనపు కలెక్టర్

by Aamani |
సకాలంలో పనులు పూర్తి చేయాలి : జిల్లా అదనపు కలెక్టర్
X

దిశ, ఆసిఫాబాద్ : అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మంగళవారం జిల్లాలోని వావుదం జీపీలోని ఖప్రి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను డీఈవో అశోక్. టిఎస్ఈడబ్ల్యూ.ఐడీసీ ఎఈ శశిధర్ తో కలిసి పరిశీలించి పనులు నిర్వహణపై ఆరా తీశారు.అనంతరం ఆసిఫాబాద్ మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకరూప దుస్తుల కుట్టు కేంద్రాన్ని సందర్శించారు. అధికారులు ఆయా కుట్టు కేంద్రాలను పర్యవేక్షిస్తూ పనులను వేగవంతం జరిగేలా చూడాలని ఆదేశించారు.

Next Story