- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడ్జెట్‌లో రైతులు, మహిళలకు భారీ శుభవార్త
దేశ వ్యాప్త రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ శుభవార్త అందించారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్త రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ శుభవార్త అందించారు. 2027కు సంబంధించిన బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దీంతో పాటు తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం, కొబ్బరి రైతుల కోసం కొత్త పథకం, కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం, జీడిపప్పు, కోకో ఉత్పత్తికి చర్యలు, గంధం చెట్ల వనాలు, ఆల్మండ్స్, పైన్ నట్స్ కోసం ప్రత్యేక పథకంతో పాటు మహిళల ద్వారా ప్రత్యే షీ బజార్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం చేయబోతోందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల ఏపీకి భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కొబ్బరి తోటలో అగ్ని ప్రమాదం జరిగి భారీ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ వార్త బాధిత రైతులకు ఉపశమనం కలిగించనుంది.
Read More..






