- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భద్రాద్రి అభివృద్ధి:మంత్రి పొంగులేటి
ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంను అభివృద్ధి చేస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

దిశ, భద్రాచలం: ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంను అభివృద్ధి చేస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మొదటి దశ అభివృద్ధి పనులకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించింది. ఆదివారం ఉదయం మంత్రి పనులను పరిశీలించారు. భద్రాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులకు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే ఆలయం దక్షిణం వైపు ఉన్న శ్రీ కుసుమ హరనాథ్ బాబా ఆలయం, చిత్ర కూట మండపం, వంటశాల తొలిగించారు. గుట్టను కూడా తొలగించి విస్తరణ చేస్తున్నారు. అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండగా.. వచ్చే సంవత్సరం శ్రీరామ నవమి నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయనున్నారు. ఒక వైపు పనులు జరుగుతున్న.. భక్తులకు రామయ్య దర్శనం ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూనెం కృష్ణ, అధికారులు పాల్గొన్నారు.






