- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ బ్రాలు వేసుకోమని టార్చర్ పెట్టేవారు.. సంచలన నిజాలు బయటపెట్టిన సమీరా రెడ్డి
తెరపై అందంగా కనిపించడం కోసం దాదాపు 20 ఏళ్ల పాటు తాను నరకం అనుభవించానని అన్నారు.

దిశ, సినిమా: గ్లామర్ డాల్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. జై చిరంజీవ, నరసింహుడు, అశోక్ వంటి భారీ కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిన ఆమె..పలు సినిమాలు చేశారు. ఈనేపథ్యంలోనే.. పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. చాలాకాలం ఇండస్ట్రీకి దూరం అయిన సమీరా రెడ్డి ఇటీవల ‘ఆఖ్రీ సవాల్’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా రెడ్డి.. తన కెరీర్ మొదట్లో జరిగిన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్టార్ హీరోల పక్కన నటించే సమయంలో హీరోయిన్ల శరీరాకృతి విషయంలో ఇండస్ట్రీలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయో చెప్తూ సంచలన విషయాలను బయటపెట్టారు. తెరపై అందంగా కనిపించడం కోసం దాదాపు 20 ఏళ్ల పాటు తాను నరకం అనుభవించానని అన్నారు.
సినిమాల్లో నటిస్తున్నప్పుడు ప్యాడెడ్ బ్రాలు, బంప్ ప్యాడ్స్ ధరించాలంటూ దర్శకులు, చిత్ర యూనిట్ తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చేవారని సమీరా ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీ శరీరాన్ని మరింత ఆకర్షణీయంగా చూపించడం కోసం వాడే ప్యాడెడ్ బ్రాలు ధరించడం తనకు చాలా అసౌకర్యంగా ఉన్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని వాడాల్సి వచ్చేదని చెప్పారు. అలాగే తన నడుము కింది భాగం ఫ్లాట్‌గా ఉందని, అక్కడ కూడా బలవంతంగా బంప్ ప్యాడ్స్ పెట్టించేవారని గుర్తు చేసుకున్నారు. ఈ విషయాలను మొహం మీదే నేరుగా అనేవారని చెప్పారు. కేవలం ఇండస్ట్రీ డిమాండ్స్ కోసమే ప్యాడెడ్ బ్రాలు, బంప్ ప్యాడ్స్‌తో పాటు కలర్ కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతూ.. కెమెరా ముందు కృత్రిమంగా బతకాల్సి వచ్చిందని సమీరా రెడ్డి ఎమోషనల్ అయ్యారు. డ్రెస్ డిజైనర్లు సైతం తన బాడీ షేప్ గురించి కామెంట్స్ చేస్తూ.. తాను వేసుకునే దుస్తులన్నింటికీ లోపల ప్యాడ్స్ కుట్టించేవారని వాపోయారు. హీరోయిన్ల శరీరాకృతిపై ఇండస్ట్రీ చూపే వివక్షను, పెట్టిన ఒత్తిడిని సమీరా రెడ్డి బయటపెట్టడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.






