- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంగ్ ఇండియా దూకుడు చూసి గర్విస్తున్నా.. పార్లమెంట్ వేదికగా ప్రధాని కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం అవుతున్న వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభకు వెళ్లే మందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. వర్షాకాలం, వర్షాకాల సమావేశాలు ఒకేసారి వచ్చాయని, రెండూ ఒకేసారి వస్తే సత్ఫలితాలు ఉంటాయని ఛలోక్తులు విసిరారు. గత నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయని అన్నారు. మన యువత అంతరిక్షంలోకి దూసుకుపోయిందని కామెంట్ చేశారు. ‘స్కై రూట్’ సక్సెస్ అవడం మన దేశానికే గర్వకారణం అని అన్నారు. 28 ఏళ్ల యువకులు కలిసి ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వీరి ఘనత మన దేశ యువతకు మంచి ప్రేరణను ఇస్తుందని అన్నారు. మన యువత సాహసాలు చేయడమే కాదు.. సక్సెస్ కూడా అవుతున్నారని ప్రధాని మోడీ తెలిపారు.
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలి..
ఇక రాజస్థాన్‌లో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని దేశానికి అంకితం చేశామని ప్రధాని మోడీ తెలిపారు. ఒక సెమీ కండక్టర్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్‌ను కూడా ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. మిడిలీస్ట్ దేశాల వల్ల చాలా దేశాలను నష్టం జరగుతోందని అన్నారు. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయని తెలిపారు. 7.7 శాతం గ్రోత్ రేట్ మన దేశం నమోదు చేస్తోందని అన్నారు. ఈ వర్షాల పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలని కోరుతున్నానని, అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లానని కామెంట్ చేశారు.






