ఇలాంటి సమాజంలో నా కోడుకుని పెంచుతున్నానా అని బాధపడుతున్నా.. కాజల్ సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-20 05:43:26  IST  )

ఆడ, మగ అనే తేడా లేకుండా అందరికీ సమానంగా న్యాయం జరగాలని చెప్పారు. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే, ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుంటే ఎలాంటి సమస్సైనా తీరిపోతుందని సలహా ఇచ్చారు.

ఇలాంటి సమాజంలో నా కోడుకుని పెంచుతున్నానా అని బాధపడుతున్నా.. కాజల్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఒకప్పుడు భర్తల వల్ల భార్యలు చనిపోయే వార్తలు చూస్తుండేవాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది భార్యల చేతిలోనే భర్తలు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఆరు నెలల్లోనే సుమారు 322 మంది మగవాళ్లు భార్యల చేతిలో హత్యకు గురయ్యారనే వార్తలు అందరినీ భయపెడుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో కూడా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ మగాళ్ల హత్యలపై స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. సమాజంలో పురుషులపై జరుగుతున్న ఈ దాడులు చూసి ఒక తల్లిగా తనకు చాలా భయం వేస్తోందని ఆవేదన పడ్డారు. ఇలాంటి ఘోరమైన సమాజంలోనేనా తను తన కొడుకును పెంచాల్సింది అని బాధపడుతున్నట్లు చెప్పారు. కేవలం ఆడవాళ్లే కాదు, మగవాళ్లు కూడా హింసకు గురవుతున్నారని మనం ఒప్పుకోవాలని అన్నారు.

బాధితులు ఎవరైనా సరే.. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరికీ సమానంగా న్యాయం జరగాలని చెప్పారు. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే, ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుంటే ఎలాంటి సమస్సైనా తీరిపోతుందని సలహా ఇచ్చారు.ఇదే ఇంటర్వ్యూలో సౌత్ సినిమాల్లో హీరోయిన్ల నడుము, బొడ్డు చూపించడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనే విమర్శలపై కూడా కాజల్ స్పందించారు. ఒకప్పుడు అలాంటి అపోహ ఉండేదేమో కానీ, ఈ మధ్య కాలంలో సౌత్ సినిమా చాలా మారిపోయిందని చెప్పారు. గతంలో తమన్నా, తాప్సీ లాంటి హీరోయిన్లు సౌత్ ఇండస్ట్రీ వల్లే స్టార్స్ అయ్యారని, కానీ ఆ తర్వాత ఇక్కడి సినిమాలపై కొన్ని విమర్శలు చేశారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మన సినిమాల్లో కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, మేకింగ్ విధానంలో ఎంతో మంచి మార్పు వచ్చిందని కాజల్ క్లారిటీ ఇచ్చారు.

Next Story