ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకారులపై లాఠీ ఛార్జ్

by Malleboina Mahesh |   (  Updated:2026-07-20 05:04:38  IST  )

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తత.. సెక్షన్ 163 విధింపు, భారీగా మోహరించిన ఆర్ఏఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలు.

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకారులపై లాఠీ ఛార్జ్
X

దిశ, వెబ్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్ (Chalo Sansad) కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. లోక్ సభ మార్చ్ (Lok Sabha March)కి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు చెప్పడంతో.. బారీకేడ్లను దాటుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తం అయిన ఢిల్లీ పోలీసులు, ప్రత్యేక బలగాలు సీజేపీ నిరసన కారులను అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా వాగ్వాదం చెలరేగి తోపులాటకు దారి తీసింది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు, ప్రత్యేక బలగాలు నిరసన కారులను అదుపు చేసేందుకు వారిపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అలాగే పోలీసులు పలువురు కీలక నిరసన కారులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి నీట్ పేపర్ లీక్ అంశంపై మొదలైన ఈ నిరసనలు ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల వేల ఉద్రిక్తంగా మారడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది.

Next Story