రోడ్డు ఇలా నడిచేదెలా..!

by Jakkula.Mamatha |

మండల కేంద్రం నుంచి కాసింపేట, పారువేళ్లకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారడంతో కాలనీవాసులు గ్రామ ప్రజలు ప్రయాణికులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోడ్డు ఇలా నడిచేదెలా..!
X

దిశ, గన్నేరువరం: మండల కేంద్రం నుంచి కాసింపేట, పారువేళ్లకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారడంతో కాలనీవాసులు గ్రామ ప్రజలు ప్రయాణికులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం కురిసిన రోడ్ అంతా నీటితో నిండి పోతుండడంతో బురద మధ్యనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు గ్రామస్తులు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలువ నీటిలో గుంతలు కనిపించక చిన్నారులు జారి పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Next Story