ఏఈఈ దరఖాస్తులకు ముగిసిన గడువు

by Vemula.Srinu Prasad |

ద్యుత్ శాఖలో విడుదలైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏ ఈ ఈ) నోటిఫికేషన్‌కు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం రాత్రి 11:59 గంటలకు ముగియనున్నట్లు ఏపీ సిపిడిసిఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు...

ఏఈఈ దరఖాస్తులకు ముగిసిన గడువు
X

దిశ, ఏపీ బ్యూరో: విద్యుత్ శాఖలో విడుదలైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏ ఈ ఈ) నోటిఫికేషన్‌కు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం రాత్రి 11:59 గంటలకు ముగియనున్నట్లు ఏపీ సిపిడిసిఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు. అర్హత కలిగి ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, గడువు ముగిసేలోపు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించి, అవసరమైన పత్రాలను జతచేసి నిర్ణీత గడువులోపు దరఖాస్తు పూర్తి చేయాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story