ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలు పాటించాలి:ఎంఈఓ

by Jakkula.Mamatha |

వైరా పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యాశాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వైరా ఎంఈఓ చావా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలు పాటించాలి:ఎంఈఓ
X

దిశ, వైరా: వైరా పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యాశాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వైరా ఎంఈఓ చావా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైరాలోని మధిర రోడ్డులో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదురుగా ఓ వైన్ షాప్ కు అతి సమీపంలో ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేస్తున్న విషయమై ఆదివారం సాయంత్రం ‘దిశ’ వెబ్సైట్లో "వైన్ షాప్ సమీపంలో ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు పై వివాదం" అనే వార్త కథనం ప్రచురితమైంది. ఈ వార్త కథనంతో స్పందించిన ఎంఈఓ చావా శ్రీనివాసరావు సోమవారం పత్రిక ప్రకటనను విడుదల చేశారు.

ప్రభుత్వం, విద్యా శాఖ అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలల షిఫ్టింగ్, కొత్త ప్రాంగణంలో నిర్వహణ, ప్రచార బోర్డులో ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అన్ని అనుమతులు పూర్తిగా పొందిన తర్వాతే ప్రైవేట్ పాఠశాల బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వైరాలోని ప్రైవేటు పాఠశాల యజమానులు విద్యాశాఖ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇదిలా ఉండగా.. ఎలాంటి అనుమతులకు దరఖాస్తు చేసుకోకుండానే మధిర రోడ్ లోని ఒక భవనంకు ప్రైవేటు పాఠశాలను షిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేయడం, బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించడం విశేషం. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బోర్డులు తొలగిస్తారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story