సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: భాగ్యశ్రీ బోర్సే

by Mallepaka Hamsa |

నన్ను ఐరన్ లెగ్ అనడం నన్ను బాధించిందని నేను చెప్పను కానీ, నన్ను తీవ్ర గందరగోళానికి గురిచేసింది.

సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: భాగ్యశ్రీ బోర్సే
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఫుల్ ఫేమ్ రాబట్టుకున్నారు. అయితే ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద హిట్ అందుకోలేనప్పటికీ అమ్మడు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల ఆమె నటించిన ‘లెనిన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కెరీర్ ప్రారంభించిన తర్వాత తన ఖాతాలో మొదటి విజయం పడటంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇండస్ట్రీలో పాల్గొన్న భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్లపై వేసే ఐరన్ లెగ్ ముద్రపై చాలా ఘాటుగా స్పందించారు. కెరీర్ మొదట్లో తనపై వచ్చిన విమర్శల గురించి భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. నన్ను ఐరన్ లెగ్ అనడం నన్ను బాధించిందని నేను చెప్పను కానీ, నన్ను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ఎందుకంటే ఆ మాటల్లో నాకు ఎలాంటి అర్థం కనిపించలేదు. ఆ తర్వాత ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తుల ద్వారా.. ఈ పరిస్థితి కేవలం నా ఒక్కదానికే ఎదురుకాలేదని, ఇక్కడ చాలా మంది హీరోయిన్లు ఇలాంటి ఫేజ్ దాటి వచ్చారని తెలిసింది.

స్వయంగా స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను నాతో మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో తనను కూడా ఐరన్ లెగ్ అని పిలిచేవారని చెప్పింది. శృతి హాసన్, శ్రీలీల లాంటి టాప్ హీరోయిన్ల విషయంలోనూ ఇదే జరిగిందని తెలుసుకున్నానని భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు. అప్పట్లో తనకు ఇండస్ట్రీ విషయాలు తెలియవు కాబట్టే ఆ విమర్శలు వింతగా అనిపించేవని చెప్పారు. సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లదే తప్పు అనడం కరెక్ట్ కాదని అన్నారు. "సినిమా ఎడిటింగ్ చేసేటప్పుడు హీరోయిన్లు అక్కడ ఉండరు. కథ మార్చడంలో కానీ, సీన్లు తీసేయడంలో కానీ వాళ్లకు ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటప్పుడు మూవీ ఆడకపోతే హీరోయిన్లని ఎలా తప్పుపడతారు? అసలు ఏ నటుడినైనా సినిమా ఫ్లాప్‌కు ఎలా బాధ్యుడిని చేస్తారు? అని ప్రశ్నించారు. తన దృష్టిలో మూవీ అనేది ఒక క్రికెట్ టీమ్ లాంటిదని.. టీమ్ మొత్తం స్కోర్ చేయలేక ఓడిపోతే.. దానికి కేవలం ఒక్కరినే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story