నిఘా నీడలో బహదూర్‌గూడ..!

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-19 07:14:29  IST  )

మండల పరిధిలోని బహదూర్‌గూడ గ్రామం ఆదివారం కూడా పోలీసుల వలయంలోకి వెళ్లింది.

నిఘా నీడలో బహదూర్‌గూడ..!
X

దిశ, శంషాబాద్: మండల పరిధిలోని బహదూర్‌గూడ గ్రామం ఆదివారం కూడా పోలీసుల వలయంలోకి వెళ్లింది. గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు బయటి వ్యక్తులు ఎవరూ గ్రామంలోకి ప్రవేశించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రైతులు సాగు చేసుకుంటున్న 650 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే.

తమకు న్యాయమైన పరిహారం ఇచ్చిన తర్వాత భూములను స్వాధీనం చేసుకోవాలని మొదటి నుంచి రైతులు డిమాండ్ చేస్తున్న విషయం విధితమే. తమ డిమాండ్లు నెరవేర్చాలని దీక్ష చేపట్టిన రైతులను పోలీసులు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించి వారు గతంలో ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. గ్రామంలోకి రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఇతరులను అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Next Story