ఒక్క ఓటు మిస్ కావద్దు

by Taduka Kalyani |

సంగారెడ్డి నియోజకవర్గంలో అర్హులైన ఏ ఒక్కరి ఓటు మిస్ కాకుండా కాంగ్రెస్ బిఎల్వోలు, నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని జగ్గారెడ్డి, నిర్మల లు ఆదేశించారు.

ఒక్క ఓటు మిస్ కావద్దు
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గంలో అర్హులైన ఏ ఒక్కరి ఓటు మిస్ కాకుండా కాంగ్రెస్ బిఎల్వోలు, నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని జగ్గారెడ్డి, నిర్మల లు ఆదేశించారు. గత నెల రోజులుగా అమలవుతున్న సర్ ప్రక్రియపై ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్ లో కాంగ్రెస్ బిఎల్ఏ లు, ముఖ్య నాయకులతో జగ్గారెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సర్ ప్రక్రియకు ఇంకా పది రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్ సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో ఆదివారం సాయంత్రం బిఎల్ఏలతో వారు సమావేశమయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని 282 బిఎల్ఏలు ఒక్కొక్కరితో జగ్గారెడ్డి ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటికి ఎన్ని ఫారాలు పంపిణీ చేశారు, ఇచ్చిన ఫారాల్లో ఎన్ని తిరిగి వచ్చాయి, ఇంకా ఎన్ని రావాల్సి ఉంది అని అడిగి వారి నుంచి సమాచారం తీసుకున్నారు.

ప్రతి బీఎల్ఎలు బాధ్యతగా పనిచేయాలి

సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జి మీనాక్షి నటరాజన్ లు సర్ ప్రక్రియ పై దిశా నిర్దేశం చేశారని, వారి ఆదేశాల మేరకు ప్రతీ ఒక్క బిఎల్ఏ లు స్వయంగా, బాధ్యతగా తమ వార్డు పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్ళాలని, ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ప్రతీ ఓటు నమోదు జరిగేలా జాగ్రత్త తీసుకోవాలని జగ్గారెడ్డి సూచించారు. ఇప్పటి వరకు సంగారెడ్డి నియోజకవర్గంలో 66.67 శాతం ఓటరు నమోదు పూర్తయిందని, గడువు పది రోజులు ఉన్నప్పటికీ రానున్న ఐదు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. మూడు రోజుల తర్వాత మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తానని ఆలోపు దాదాపు పూర్తయ్యేలా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ ప్రభు, నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story