- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని ఏర్పాట్లు సిద్ధం.. అజిత్ కుమార్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన అధిక్ రవిచంద్రన్
సినిమాకు సంబంధించిన కథ, ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తిగా పూర్తయ్యాయని.. షూటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, మాస్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా రాబోతోంది. ప్రస్తుతం ‘AK64’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు టాక్. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ చిత్రంలో మొదట టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని సమాచారం. ఆ తర్వాత ఆమె స్థానంలో కాయదు లోహర్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులు అవుతున్నా, ఇప్పటివరకు షూటింగ్ మొదలు కాకపోవడంతో ఇండస్ట్రీలో రకరకాల పుకార్లు వినిపించాయి. ఈ మూవీ ఆగిపోయిందంటూ కూడా కొందరు ప్రచారం చేశారు. తాజాగా ఈ పుకార్లపై దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఒక ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన కథ, ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తిగా పూర్తయ్యాయని.. షూటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. అలాగే వచ్చే ఆగస్టు నెలలో హీరో అజిత్ టీమ, నిర్మాత ఇద్దరి వైపు నుంచి సినిమాకు సంబంధించిన ఒక అధికారిక ప్రకటన వస్తుందని వెల్లడించారు. ఆ ప్రకటన వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా, పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుందని డైరెక్టర్ స్పష్టం చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అజిత్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.






