- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా ఫ్యామిలీ హిస్టరీ మళ్లీ ఇలా రిపీట్ అవ్వడం నమ్మలేకపోతున్నా.. నిహారిక ఎమోషనల్ కామెంట్స్
సరిగ్గా 36 ఏళ్ల క్రితం తన తండ్రి నాగబాబు నిర్మాతగా మారిన మొదటి సినిమా ‘రుద్రవీణ’కు మూడు జాతీయ అవార్డులు వచ్చాయని చెప్పారు.

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరించిన ‘కమిటి కుర్రోళ్లు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ నిలవడంతో పాటుగా ఏకంగా జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యంలో, కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులను గెలుచుకుని తెలుగు సినీ ఇండస్ట్రీకి మరోసారి గర్వకారణంగా నిలిచింది. ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్రబృందం ఒక ప్రత్యేకమైన ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిహారిక చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. తమ కుటుంబానికి జాతీయ అవార్డులతో ఉన్న ఒక అరుదైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సరిగ్గా 36 ఏళ్ల క్రితం తన తండ్రి నాగబాబు నిర్మాతగా మారిన మొదటి సినిమా ‘రుద్రవీణ’కు మూడు జాతీయ అవార్డులు వచ్చాయని చెప్పారు.
ఇప్పుడు తాను నిర్మాతగా వ్యవహరించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా కూడా రెండు జాతీయ అవార్డులను గెలుచుకోవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని అన్నారు. తమ మెగా ఫ్యామిలీ హిస్టరీ మళ్లీ ఇలా రిపీట్ అవ్వడం నమ్మలేకపోతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి నేషనల్ అవార్డు సాధించాలనే ముందస్తు లక్ష్యంతో తాము ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయలేదని నిహారిక క్లారిటీ ఇచ్చారు. అయితే డైరెక్టర్ యదు వంశీ చెప్పిన కథ విన్న తర్వాత, ఈ సినిమాను ఎలాగైనా జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే బలమైన కోరిక తనలో కలిగిందని చెప్పారు. ఇప్పుడు ఆ కల నిజం కావడంతో ఒక నిర్మాతగా తనకు ఎంతో తృప్తినిస్తోందని అన్నారు. ఈ అద్భుతమైన విజయంపై మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎంతో సంతోషపడ్డారని, ఆయన తనను ప్రత్యేకంగా అభినందించడం మరింత ఇన్‌స్పిరేషన్‌ను ఇచ్చిందని నిహారిక ఈ ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు.






