- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FLASH: లైంగిక ఆరోపణలు.. ట్రైనీ IPS ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
తోటి మహిళా ఐపీఎస్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి (Udaya Krishna Reddy)పై లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి అత్తాపూర్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ కృష్ణారెడ్డి నిన్న మోతీనగర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇవాళ ఉదయం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన బంధువులు అతడిని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ (Erragadda)లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్..
ఇక తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఉదయం సోషల్ మీడియా వేదికగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి స్పందించారు. ఈ మేరకు ఓ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) స్టోరీ పోస్ట్‌చేశారు. తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పక గెలుస్తుందని సోషల్‌మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. నిజానిజాలు తెలుకున్న తర్వాతే వాస్తవాలను రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకకు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను వేధిస్తున్నారని ఆదివారం సాయంత్రం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ (Attapur Police Staton)లో ఉదయ కృష్ణారెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
మరోవైపు పోలీసుల దర్యాప్తు షురూ..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక ఆరోపణల కేసులో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. జాతీయ పోలీసు అకాడమీలో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం నేరుగా వారు ప్రకాశం జిల్లా (Prakasam District)లోని ఉదయ్ కృష్ణారెడ్డి స్వగ్రామానికి వెళ్లారు. ఈ కేసును హైదరాబాద్ సీపీ సజ్జనర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం.






