- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విదేశీ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్ పరిమితి 10 శాతానికి పెంపు
ఈ రోజు లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో విదేశీ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో విదేశీ పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు (Persons Resident Outside India - PROI) ఇకపై భారతీయ లిస్టెడ్ కంపెనీల ఈక్విటీ షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు ఉన్న పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 5 శాతం పెట్టుబడి పరిమితిని 10 శాతానికి పెంచుతూ బడ్జెట్ 2026-27లో ప్రతిపాదనలు చేశారు.
ఈ నిర్ణయం ద్వారా 'పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్' (PIS) కింద విదేశీయులు భారతీయ కంపెనీలలో మరింత ఎక్కువ వాటాను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. దీనివల్ల భారతీయ కంపెనీలకు విదేశీ మూలధనం సులభంగా అందుబాటులోకి రావడమే కాకుండా, స్టాక్ మార్కెట్లలో లిక్విడిటీ (నగదు లభ్యత) కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లు భారత వృద్ధి పథంలో భాగస్వాములు కావడానికి ఈ సంస్కరణ ఒక చక్కని అవకాశమని మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Read More..






