Union Budget 2026 : బాలికల కోసం ప్రతి జిల్లాలో ఒక హాస్టల్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-01 06:26:36  IST  )

బాలికలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.

Union Budget 2026 : బాలికల కోసం ప్రతి జిల్లాలో ఒక హాస్టల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలికలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలికల కోసం ఒక హాస్టల్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు ఆతిథ్యరంగంలో జాతీయ సంస్థ ఏర్పాటు, 20 పర్యాటక ప్రాంతాల్లో పదివేల గైడ్‌ల నియామకం, సూక్ష్మతరహా పరిశ్రమలకు రూ.2వేల కోట్లు కేటాయింపు, స్వయం సమృద్ధ భారతం పేరుతో రూ.2వేల కోట్ల ఫండ్‌ ఏర్పాటు, ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా ఎంఎస్‌ఎంఈలకు చేయూత వంటి కీలక ప్రకటనలను నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌కు గుడ్ న్యూస్

Next Story