నీట్ ఫలితాల్లో న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థుల ప్రతిభ

by Jakkula.Mamatha |

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ప్రకటించిన నీట్ 2026 ఫలితాలలో న్యూఇరా వారి న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సత్తా చాటారు.

నీట్ ఫలితాల్లో న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థుల ప్రతిభ
X

దిశ, వైరా: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ప్రకటించిన నీట్ 2026 ఫలితాలలో న్యూఇరా వారి న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సత్తా చాటారు. ఈ కళాశాలలో మొత్తం 20 మంది విద్యార్థులకు గాను ఐదుగురు విద్యార్థులు మెడిసిన్ సీట్లు సాధించారు. ఈ కళాశాలకు చెందిన ఎన్.గోపిక అక్షయ, ఎం.అర్పణ, యూ.అక్షరసిరి, వి.యశ్వంత్, ఎన్.ఎంజల్ స్వీటీ, మెడిసిన్ సీట్లు సాధించారు. ఈ సందర్భంగా న్యూ ఇరా విద్యాసంస్థల చైర్మన్ ఐవి. రమణారావు, కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు, డైరెక్టర్ కుర్రా సుమన్ మాట్లాడుతూ, విద్యార్థులను ఐఐటీ , నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రణాళిక బద్ధంగా పాఠశాల స్థాయి నుండే సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

దీంతో నీట్ 2026 ఫలితాలలో ఐదుగురు మెడిసిన్ సీట్లు సాధించారని వివరించారు. తక్కువ మంది విద్యార్థులతో నీట్ పరీక్షల లక్ష్యంగా ప్రత్యేకమైన ప్రణాళికతో కళాశాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. విశ్లేషణాత్మకమైన పరిజ్ఞానాన్ని అందించే అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థులు లక్ష్యం వైపు ప్రయాణించే దిశగా నిరంతరం పర్యవేక్షించే డైరెక్టర్స్ బృందంతో అద్భుత ఫలితాలు సాధించామన్నారు. వైరా డివిజన్‌లో కళాశాలను ప్రారంభించిన 5 సంవత్సరాల్లో ప్రతీ సంవత్సరం మెడిసిన్ విద్యార్థులను అందిస్తున్న ఏకైక కళాశాల న్యూఇరా వారి న్యూ లిటిల్ ఫ్లవర్ అని ప్రకటించడానికి చాలా గర్వంగా ఉందన్నారు. అనంతరం మెడిసిన్ సీట్ల సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం. భువన ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story