- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలన ఎలా చేయాలో జగన్‌ను చూసి నేర్చుకోండి: దేవినేని అవినాశ్
రాష్ట్రాన్ని ఎలా పాలించాలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని వైసీపీ నేత దేవినేని అవినాశ్ అన్నారు. విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబానికి ఎంపీ నందిగామ సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన రూ. 10 లక్షల సాయం అందించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాన్ని ఎలా పాలించాలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohanreddy)ని చూసి నేర్చుకోవాలని వైసీపీ నేత దేవినేని అవినాశ్(Ycp Leader Devineni Avinash) అన్నారు. విజయవాడ(Vijayawada)లో ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబానికి ఎంపీ నందిగామ సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన రూ. 10 లక్షల సాయం అందించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో దారుణాలు...
ఈ సందర్భంగా నందిగం సురేశ్, దేవినేని అవినాశ్, మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో దారుణాలు పెరిగిపోయాయన్నారు. కృష్ణలంక మాజీ సీఐ వేధింపులతోనే క్రాంతి కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత కనీసం పరామర్శించలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలంటే సీఎం చంద్రబాబుకు చిన్న చూపు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఇందుకు క్రాంతి కుమార్ ఘటనే నిదర్శనమన్నారు. క్రాంతి కుమార్ మరణంతో కూటమి నిజస్వరం బయటపడిందన్నారు.
పోలీసు వ్యవస్థపై ఆరోపణలు
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ఆరోపించారు. సామాన్యులు బతికే పరిస్థితి పోయిందని ఆరోపించారు. తెలుగుదేశం అంటే బూడిద పార్టీ అని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కంటే జగన్ పాలనే బాగుందని అనుకుంటున్నారని తెలిపారు. కృష్ణా డెల్టాపై మాట్లాడే అర్హత సీఎం చంద్రబాబుకు లేదని విమర్శించారు.






