- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెవీ వర్కవుట్స్ కంటే డైలీ వాకింగే బెటర్..! ఎందుకంటే..
డైలీ వాకింగ్ మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. ఎండార్ఫిన్స్ విడుదల చేసి స్ట్రెస్, ఆందోళనలను తగ్గిస్తుంది.

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యం కోసం, ఫిట్‌నెస్ కోసం రకరకాల వ్యాయామాలు ప్రయత్నిస్తుంటారు కొందరు. మరికొందరు వీక్లీవన్స్ హెవీ వర్కవుట్స్ ప్లాన్ చేస్తుంటారు. కానీ.. వీటన్నింటికంటే డైలీ వాకింగ్ ఎంతో బెటర్ అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఎప్పుడో ఒకసారి తీవ్రమైన వ్యాయామం చేసి, మిగతా రోజులు కూర్చొని ఉండటం కంటే.. రోజూ కొంతసేపు నడవడం మీ శరీరాన్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుతుందని చెబుతున్నారు. ఇంకా ఏయే ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెకు మేలు..
ప్రతిరోజూ కనీసం 20-30 నిమిషాలు నడవడం మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. డైలీ వాకింగ్ వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి, బ్లడ్ షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. ఇది డయాబెటిస్ నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది.
మానసిక ఆరోగ్యానికి..
డైలీ వాకింగ్ మానసిక స్థితిని మెరుగు పరుస్తుందని, ఇది ఎండార్ఫిన్స్ విడుదల చేసి స్ట్రెస్, ఆందోళనలను తగ్గిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ఒక్కసారి ఇంటెన్స్ వర్కౌట్ చేయడం కంటే రోజూ చిన్న చిన్న నడకలు అలవాటు చేసుకోవడం సులభమే కాకుండా.. ఆరోగ్యానికి మంచిది. పైగా ఇలా దీర్ఘకాలికంగా వాకింగ్ చేయడంవల్ల అలవాటుగా మారి, ఫలితాలు స్థిరంగా ఉంటాయి. ఇందుకోసం జిమ్ లేదా ఖరీదైన సామగ్రి అవసరమే లేదు. సౌకర్యవంతమైన షూస్ ఉంటే చాలు.
దీర్ఘకాలిక ప్రయోజనాలు
ఒక్కసారిగా చేసే పెద్ద ప్రయత్నాలకంటే.. రోజువారీగా చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మెరుగైన ఫలితాలను ఇస్తాయి అంటారు పెద్దలు. వాకింగ్ విషయంలోనూ ఇది వర్తిస్తుంది. వారంలో ఒక్కరోజు మాత్రం భారీగా వ్యాయామం చేస్తే శరీరం ఒత్తిడికి గురవుతుంది. గాయాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ రోజూ చేసే నడక సాధారణంగా సురక్షితమే కాకుండా సులభం కూడాను. పైగా వాకింగ్ ఎవరైనా చేయగలుగుతారు. అంతేకాకుండా ఇది బరువు నియంత్రణ, ఎముకల బలం, మెరుగైన నిద్ర, మొత్తం ఆయుష్షు పెంచడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రతిరోజూ కొంతసేపు నడవడం ఉత్తమం అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






