- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందం, హాట్‌నెస్‌కు కొదవలేదు.. ఆ ఒక్కటి లేక వెనుకబడిన రాశి సింగ్
అందం, నటనతో సరైన విజయం లేక రాశి సింగ్ కెరీర్ ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు.

దిశ, వెబ్ డెస్క్: సినీ పరిశ్రమలో అందం, అభినయం ఉన్నంత మాత్రాన విజయాలు వస్తాయనే గ్యారంటీ లేదు. ప్రతిభ ఉన్నప్పటికీ సరైన హిట్ లేకపోతే అవకాశాలు తగ్గిపోతాయి. అలాంటి హీరోయిన్లలో యంగ్ బ్యూటీ రాశి సింగ్ ఒకరు.
ఈమె ఇప్పటివరకు పలు తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే నటించిన ప్రతి సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది.
తాజాగా రాశి సింగ్, వడ్డే నవీన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలోనూ ఆమె తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు.
దీంతో రాశి సింగ్‌కు ఒక్క భారీ విజయం దక్కితే టాలీవుడ్‌లో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ రాశి సింగ్ చురుకుగా ఉంటూ తన గ్లామర్ ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తోంది.
తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్‌లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో ఆమె స్టైలిష్, గ్లామరస్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: ఇంస్టాగ్రామ్






