- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చనిపోవాలని లేదు కానీ.. ప్రియుడి స్నేహితుల ఒత్తిడితో యువతి ఆత్మహత్య
కాకినాడ జిల్లా తునిలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. రజిని, రాజేంద్ర అనే యువతీ యువకులు నాలుగేళ్లుగా ప్రేమించుకోగా ఇటీవల రజినికి కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా తునిలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. రజిని, రాజేంద్ర అనే యువతీ యువకులు నాలుగేళ్లుగా ప్రేమించుకోగా ఇటీవల రజినికి కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. తన ప్రియురాలికి పెళ్లి నిశ్చయించడంతో రాజేంద్ర తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడి స్నేహితులు రజినిని పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. పెళ్లి చేసుకుంటే తమ స్నేహితుడు చనిపోతాడని కాబట్టి ఎలాగైనా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని రాజేంద్రను పెళ్లి చేసుకోవాలని సూచించారు. ఇంట్లో వాళ్లకు నొప్పించలేక.. అటు ప్రయుడిని బాధపెట్లలేక రజిని తీవ్ర ఆవేదనకు గురైంది.
ఈ క్రమంలోనే చనిపోవాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ లో కీలక విషయాలు పేర్కొంది. తనకు చనిపోవాలని లేదని కానీ ఏం చేయాలో తెలియడంలేదని పేర్కొంది. లెటర్ లో అమ్మా.. ఐ లవ్ యూ అంటూ భావోద్యేగానికి లోనైంది. యువతి మరణించిన తరవాత రాజేంద్ర స్నేహితులు పరారీలో ఉన్నారు. రజిని మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాజేంద్ర స్నేహితులు బెదిరింపులకు పాల్పడటం వల్లనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.






