బీఆర్ఎస్‌లో యూత్ కాంగ్రెస్ నాయకుల చేరిక..

by Jakkula.Mamatha |

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

బీఆర్ఎస్‌లో యూత్ కాంగ్రెస్  నాయకుల చేరిక..
X

దిశ, చిట్యాల: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు అవలంబిస్తున్న అరాచక విధానాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. పార్టీలో చేరిన షేక్ జహంగీర్, అరూరి శివ, మిర్యాల మచ్చగిరి, గోలి సాయి, బొడ్డుపల్లి చింటూలకు ఆయన బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆరూరి శ్రీశైలం, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఏనుగు ఇంద్రారెడ్డి, పంది మణికంఠ, ఆరూరి రవి, మాంకాల కుమార్, ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, లోడే చిరంజీవి, గడ్డం సూర్యప్రకాశ్ రెడ్డి, దేవి రెడ్డి సందీప్ రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, చిన్నం సాయికుమార్, అరూరి నవీన్, తదితరులు ఉన్నారు.

Next Story